హైదరాబాద్: తనతో పాటు తన అత్తామామలకు రక్షణ కల్పించాలని హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి పోలీసులను కోరారు.మంగళవారం నాడు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లును అవంతి, ఆమె అత్తామామలు కలిశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ నెల 24వ తేదీన సాయంత్రం హేమంత్ ను కిడ్నాప్ చేసి అదే రోజున అవంతి కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులను కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తమ అత్తామామల ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని అవంతి తెలిపారు. గచ్చిబౌలిలో హేమంత్ తో కలిసి ఉన్న ఇంట్లో తన వస్తువులను తీసుకెళ్లేందుకు వెళ్లిన సమయంలో తన కారును కొందరు వెంబడించారని అవంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన మరిదిని కూడ కొందరు వ్యక్తులు కూడ  వెంటాడినట్టుగా పోలీసులకు అవంతి తెలిపారు.

తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. హత్య జరిగిన సమయంలో హేమంత్ నుండి నిందితులు తీసుకొన్న బంగారంతో పాటు ఇతర వస్తువులను పోలీసుల నుండి అవంతి కుటుంబసభ్యులు తీసుకొన్నారు.