బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులను విచారిస్తాం: హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్
ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణకు పల్లవి ప్రశాంత్ కారణమని హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ చెప్పారు.
హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు సీజన్ నిర్వాహకులను కూడ త్వరలో విచారిస్తామని హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ చెప్పారు.
శుక్రవారంనాడు హైద్రాబాద్ లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఈ నెల 17వ తేదీన రాత్రి హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది.పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణ నేపథ్యంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు.ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, పోలీసుల వాహనాలపై దాడికి దిగారు.ఈ ఘటనపై హైద్రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై రెండు కేసులు నమోదు చేశారు. మొదటి కేసులో పల్లవి ప్రశాంత్ తో పాటు 16 మందిపై కేసులు నమోదు చేసినట్టుగా డీసీపీ విజయ్ చెప్పారు.రెండో ఎఫ్ఐఆర్ లో బిగ్ బాగ్ తెలుగు సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిపైనే కేసు నమోదైందని విజయ్ తెలిపారు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
ఈ నెల 17వ తేదీన పల్లవి ప్రశాంత్ కారణంగానే ఘర్షణ మరింత పెద్దదైందని డీసీపీ విజయ్ వివరించారు. అన్నపూర్ణ స్టూడియ్ వెలుపల అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయాన్ని గమనించి మరో మార్గంలో పల్లవి ప్రశాంత్ ను బయటకు పంపించినట్టుగా డీసీపీ చెప్పారు. అయితే పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని డీసీపీ విజయ్ తెలిపారు.
also read:బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్: పల్లవి ప్రశాంత్ కు జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసులు
ఈ కారణంగా ఘర్షణ ఎక్కువైందని ఆయన తెలిపారు. పోలీసుల ఆదేశాలను కూడ ఉద్దేశ్యపూర్వకంగానే పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు ఉల్లంఘించారని డీసీపీ విజయ్ చెప్పారు. బిగ్ బాగ్ తెలుగు సీజన్ 7 నిర్వాహకులను కూడ విచారిస్తామని పోలీసులు తెలిపారు.