హైదరాబాద్: సీఎం అభ్యర్ధిని  ఎన్నికల తర్వాత నిర్ణయిస్తామని  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ చెప్పారు. ప్రస్తుతం తమ ముందు  కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ఆయన చెప్పారు.

ప్రజా కూటమి నేతలు బుధవారం నాడు హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు, సురవరం సుధాకర్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు.

ఇప్పుడే సీఎం అభ్యర్ధి ఎవరనే విషయం చెప్పడం  సరైన సమయం కాదన్నారు. తాము తొలుత  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు రాహుల్ గాంధీ చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాము సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామన్నారు. 

రైతుల సంక్షోభం అనేది  తెలంగాణ సమస్యే కాదు, ఈ సమస్య  దేశ వ్యాప్తంగా ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ చెప్పారు. రైతులు దేశానికి పెద్ద ఆస్తిగా మేం భావిస్తున్నామన్నారు. 

సుమారు 15 మందికి రూ.3 లక్షల కోట్లకుపైగా రుణాలను ఇచ్చారని చెప్పారు.  ఈ డబ్బులను  రైతుల కోసం ఖర్చు చేస్తామని రాహుల్ చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది ప్రజా కూటమి పెద్ద ప్రాధాన్యతగా నిర్ణయించుకొంటామన్నారు. రైతులకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను  ఏర్పాటుచేస్తామన్నారు.

ప్రభుత్వ పరంగా కాలేజీలు, స్కూళ్లు ఏర్పాటు చేసి విద్యకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్యతో పాటు  వైద్యానికి కూడ మరింత ప్రాధాన్యత అందిస్తామన్నారు.నోట్ల రద్దుతో  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా కూటమి  చర్యలు తీసుకొంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

దేశ రాజకీయాల్లో మార్పు తెలంగాణతోనే ఆరంభం: ప్రజా కూటమి