దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలు ఆరంభం అవుతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: దేశ రాజకీయాల్లో మార్పుకు తెలంగాణ ఎన్నికలు ఆరంభం అవుతాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
బుధవారం సాయంత్రం ప్రజా కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ,టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులు మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజా కూటమికి ఓటు వేయాలని చంద్రబాబునాయుడు కోరారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ధనిక రాష్ట్రమన్నారు.కానీ, ఈ రాష్ట్రాన్ని సరైనదిశలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఓటేస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతోందన్నారు.
అంతకుముందు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సాకారం అవుతాయని తాము భావించామన్నారు.కానీ తాము అనుకొన్నట్టుగా తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రజల జీవితాలు బాగుపడతాయని భావించినా... ఆ దిశగా పాలన రాలేదన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. తెలంగాణలో అనుకొన్న ఫలితాలు రాలేదన్నారు.పోరాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారన్నారు.
