Asianet News TeluguAsianet News Telugu

వరద ప్రభావిత ప్రాంతాల్లో 18 బోట్లతో రెస్క్యూ: ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరద పరిస్థితి దారుణంగా ఉందని  అగ్నిమాపక శాఖ డీజీ  నాగిరెడ్డి  చెప్పారు. 
 

We Rescued  Several People  around  18 boats  in Telangana says  Fire DG  Nagi Reddy lns
Author
First Published Jul 27, 2023, 4:30 PM IST


హైదరాబాద్: భూపాలపల్లి జిల్లా  మోరంచపల్లిలో వరద పరిస్థితి  దారుణంగా ఉందని  అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి  చెప్పారు.గురువారంనాడు   ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

తమ శాఖకు  చెందిన సిబ్బంది బోట్ల సహాయంతో మోరంచపల్లి గ్రామస్తులను  కాపాడినట్టుగా ఆయన  చెప్పారు.   ఈ గ్రామంలో  70 మందిని కాపాడినట్టుగా  డీజీ  నాగిరెడ్డి వివరించారు. ములుగులో సెల్ఫీ కోసం వెళ్లి  ఇద్దరు ప్రమాదంలో పడ్డారన్నారు . వీరిని రక్షించే ప్రయత్నాలు  చేస్తున్నామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 18 బోట్లతో రెస్క్యూ  చర్యలు చేపట్టామన్నారు.

భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం  చేశాయి.  రాష్ట్రంలోని పలు  జిల్లాల్లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్రంలోని  23 జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి.  రికార్డు స్థాయిలో వర్ష పాతం నమోదైంది.  60 సెం.మీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మోరంచపల్లి వాగులో  ఆ గ్రామ వాసులు  ఇబ్బంది పడ్డారు.   ఖమ్మం  జిల్లా భద్రాచలంలో కూడ  వరద పోటెత్తింది.

also read:రంగంలోకి ఆర్మీ హెలికాఫ్టర్లు.. మోరంచపల్లి గ్రామస్తులు సురక్షితం, వూరు మొత్తం ఖాళీ

హైద్రాబాద్ నగరాన్ని  వరద ముంచెత్తింది.  నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి.వరంగల్ పట్టణంలో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వరంగల్ లో పలు కాలనీలో నీటిలోనే ఉన్నాయి. వరంగల్ కు  మున్సిఫల్ శాఖ డైరెక్టర్  రేపు  వెళ్లనున్నారు. మంత్రి కేటీఆర్ కూడ  అవసరమైతే వరంగల్ కు వెళ్లే అవకాశం ఉంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios