'తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసు': కవితకు నోటీసులతో పిళ్లై స్టేట్ మెంట్ వెనక్కి

అరుణ్ రామచంద్ర పిళ్లై గతంలో  ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకున్న విషయమై  కోర్టులో  వాదనల సమయంలో  ఈడీ  కీలక వ్యాఖ్యలు  చేసింది.  

we have evidence arun ramachandra pillai in Delhi liquor scam:ED


న్యూఢిల్లీ: విచారణ సందర్భంగా  అరుణ్ రామచంద్రపిళ్లైను వేధింపులకు గురి  చేయలేదని  ఈడీ అధికారులు   తెలిపారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  గతంలో  ఇచ్చిన వాంగ్మూలాన్ని  వెనక్కి తీసుకుంటున్నట్టుగా   అరుణ్ రామచంద్రపిళ్లై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై  జరిగిన  వాదనల సమయంలో   ఈడీ కీలక అంశాలను  ప్రస్తావించింది. . అరుణ్ రామచంద్ర పిళ్లైను విచారణ  సమయంలో  సీసీటీవీ రికార్డులు కూడా ఉన్నాయని  కోర్టుకు  తెలిపారు ఈడీ అధికారులు. 

2022 సెప్టెంబర్  18న అరుణ్ రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్  ఇచ్చారని  ఈడీ కోర్టులో  వాదనలు విన్పించింది.  కానీ ఈ నెలలో  అరుణ్ రామచంద్ర పిళ్లై  తన స్టేట్ మెంట్ ను  మార్చుకున్నారని  ఈడీ అధికారులు  ఆరోపించారు.   అరుణ్ రామచంద్రపిళ్లై ఇచ్చిన మూడు స్టేట్ మెంట్లలో  అదే  అంశాన్ని  అరుణ్ రామచంద్ర పిళ్లై  పేర్కొన్నాడని  ఈడీ న్యాయవాది  కోర్టులో వాదించారు. 

ఈ  పిటిషన్ పై  విచారణ  సందర్భంగా  ఈడీ తరపు న్యాయవాది  కోర్టులో ఈడీ తరపున వాదనలు  విన్పించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  వీవీఐపీకి  నోటీసులు జారీ చేసిన తర్వాత  తన వాంగ్మూలాన్ని  అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకున్నారని   ఈడీ తరపు న్యాయవాది  చెప్పారు. కవితకు  నోటీసులిచ్చిన తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్లై  తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారని   ఈడీ తరపు న్యాయవాది  పరోక్షంగా  కోర్టు దృస్టికి తీసుకు వచ్చారు. ఈ విషయమై  తెరవెనుక  ఏం జరుగతుందో  అర్ధమౌతుందని  ఈడీ  తరపు న్యాయవాది చెప్పారని. ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం  చేసింది.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైని  ఈ నెల  6వ తేదీన  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు.ఈ నెల  7న ఆయనను కోర్టులో హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా  తాను  వ్యవహరించినట్టుగా  అరుణ్ రామచంద్ర పిళ్లై  ఈడీకి  వాంగ్మూలం  ఇచ్చారు.ఈ వాంగ్మూలాన్ని  కోర్టుకు సమర్పించారు  ఈడీ అధికారులు. అరుణ్ రామచంద్రపిళ్లై అరెస్ట్  జరిగిన మరునాడే  కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే  ముందుగా  నిర్ణయించిన షెడ్యూల్  కారణంగా  ఈ నెల  9న విచారణకు రాలేనని కవిత ఈడీకి సమాచారం ఇచ్చింది. ఈ నెల  11న  ఈడీ విచారణకు కవిత  హాజరయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios