హైదరాబాద్: సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె విరమణకు తాము సానుకూలంగా ప్రకటించినా కూడ ప్రభుత్వం నుండి  సానుకూలంగా ప్రకటన రాకపోవడంతో ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.

Also read:తెలంగాణ ఆర్టీసీ సమ్మె.. రంగంలోకి కేంద్రం.. వెనక బీజేపీ ఎంపీలు

ఆర్టీసీ జేఎసీ నేతలు శుక్రవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరిపై జేఎసీ నేతలు  చర్చించారు. ప్రభుత్వం నుండి  సమ్మె విషయమై సానుకూలంగా స్పందన రాలేదు. భేషరతుగా విధుల్లో చేరుతామని చెప్పినా కూడ ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన లేని విషయమై కూడ ఆర్టీసీ జేఎసీ నేతలు లోతుగా చర్చించారు.

AlsoRead ఆర్టీసీ కార్మికులపై తేల్చని కేసీఆర్: తుది తీర్పు తర్వాతే నిర్ణయం..

ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.మరో వైపు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టు విచారణ చేయనుంది. ఈ తరుణంలో హైకోర్టుతో పాటు ప్రభుత్వం ఏం చేయనుందనే విషయమై ఆర్టీసీ జేఎసీ నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ నెల 23వ తేదీన సేవ్ ఆర్టీసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్ డిపోల వద్ద ఆందోళన చేయాలని ఆర్టీసీ జేఎసీ నేతలు చేయనున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడ తమను విధుల్లోకి తీసుకోవాలని డిపో మేనేజర్ల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం భేషరతుగా  విధుల్లోకి  తీసుకోవాలని ఆశ్వత్థామరెడ్డి  ప్రభుత్వాన్ని కోరారు.

నిర్వహణ లోపం వల్లే ఆర్టీసీకి నష్టం వస్తోందని ప్రభుత్వమే చెబుతున్న విషయాన్ని  సీఎం కేసీఆర్  సమీక్ష సమావేశంలో చెప్పిన విషయాలను ఆశ్వత్థామరెడ్డి గుర్తు చేస్తున్నారు. 

ఆర్టీసీకి ఉన్న అప్పులపై మారటోరియం విధించాలని ఆశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ నెల 23వ తేదీన మరోసారి  సమావేశం కానున్నట్టుగా ఆయన చెప్పారు.ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని  ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.సమ్మె విరమిస్తామని చెప్పినా కూడ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ఆశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడ అధైర్యపడొద్దని  ఆయన సూచించారు. 

సమ్మెను విరమించాలని ఆర్టీసీ కార్మికులను తెలంగాణ సీఎం రెండు దఫాలు కోరాడు. అయితే సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మెను విరమించలేదు. అయితే హైకోర్టు సూచన మేరకు సమ్మెను విరమించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ జేఎసీ నేతలు ప్రకటించినా కూడ ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాలేదు. దీంతో సమ్మెను యధాతథంగా కొనసాగించాలని జేఎసీ నిర్ణయం తీసుకొంది.