హైదరాబాద్: దుబ్బాకలో తమ పార్టీ ఓటమి పాలైందని కొందరు పైశాచిక ఆనందంతో ఉన్నారన్నారు. గురువారం నాడు సోమాజీగూడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2014  తర్వాత ఇప్పటివరకు అనేక ఎన్నికలను ఎదుర్కొన్నామన్నారు. కానీ టీఆర్ఎస్ విజయం సాధిస్తే వార్త కాదు... టీఆర్ఎస్ ఓటమి పాలు కావడమే వార్తగా మారిందన్నారు.

also read:ఎంఐఎంకు మేయర్ పదవేందుకిస్తాం, ఒంటరి పోరు: కేటీఆర్

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఆయన చెప్పారు.తమకు ప్రజలపై విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రం నుండి పన్నుల రూపంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా కేంద్రానికి చెల్లిస్తే తమకు కేవలం సగం మాత్రమే వాటా రూపంలో కేంద్రం ఇచ్చిందన్నారు.

జీహెచ్ఎంసీలో తమ పార్టీ గెలిపిస్తే ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామో తాము సవివరింగా వివరిస్తామన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ నేతలు హైద్రాబాద్ కు ఏం చేశారో చెప్పగలరా ఆయన ప్రశ్నించారు.

కేంద్రం అనేది మిథ్య అని గతంలో ఎన్టీఆర్ చేసిన కామెంట్ ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను ప్రచారం నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే సీఎం ప్రచారానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై విపక్షాలు ఏదైనా సవాల్ చేస్తే తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను చేసిన సవాల్ విషయమై మీడియా  ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ప్రతిసారీ తానే సవాల్ చేయాలా... విపక్షాలు ఏం చేస్తాయో చూద్దామన్నారు.