హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ  చేస్తున్నామని.. తమకు ఏ పార్టీతో పొత్తు లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

గురువారం నాడు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  రాజకీయాలు ఎప్పుడూ కూడ ఓకే రకంగా ఉండవని ఆయన చెప్పారు.గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలో ఐదు స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందన్నారు.ఈ దఫా మరో ఐదు స్థానాలను గెలుచుకొంటామన్నారు. ఎంఐఎంతో తమకు పొత్తు లేదన్నారు. 

also read:దుబ్బాక ఓటమి పెద్ద సమస్యే కాదు, కానీ...: కేటీఆర్

ఎంఐఎంకు తాము జీహెచ్ఎంసీ ఛైర్మెన్ పదవిని కట్టబెడుతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.జీహెచ్ఎంసీ మేయర్ గా టీఆర్ఎస్ అభ్యర్ధి కూర్చొంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం, మూడో స్థానం ఎవరిదో తమకు అవసరం లేదన్నారు.

ప్రధాని మోడీ ఈ మధ్య వోకల్ ఫర్ లోకల్ అంటున్నారు. అదే విషయాన్ని తాము కూడ చెబుతున్నామన్నారు. తమది గల్లీ పార్టీ.. బీజేపీ ఢిల్లీ పార్టీ ఆయన సెటైర్లు వేశారు.గల్లీ పార్టీ కావాలో.. ఢిల్లీ పార్టీ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.