Asianet News TeluguAsianet News Telugu

గోదావరి నదికి పెరుగుతున్న వరద.. భద్రాచలం వద్ద 25.6 అడుగులకు చేరిన నీటిమట్టం..

గోదావరి నది పరిధిలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు, గోదావరి పరిహహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదితో పాటు, దాని ఉపనదుల్లోకి వరద పోటెత్తుతుంది.

Water flow increase in godavari river in telangana ksm
Author
First Published Jul 19, 2023, 10:43 AM IST

గోదావరి నది పరిధిలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు, గోదావరి పరిహహాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదితో పాటు, దాని ఉపనదుల్లోకి వరద పోటెత్తుతుంది. దీంతో గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పొటేత్తింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 2,886 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. వరద ఉధృతి ఇలాగే  కొనసాగితే గేట్లను ఎత్తాలని అధికారులు చూస్తున్నారు.  

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 18,261 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం  ప్రాజెక్టులో 32.27 టీఎంసీల నీటి  నిల్వ ఉంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాణహిత నుంచి 2,58,530 క్యూసెక్కుల మేర లక్ష్మీ బ్యారేజ్‌కు ప్రవాహం కొనసాగుతుంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్‌ 35 గేట్లు ఎత్తి దాదాపు అదే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి లక్ష్మీ బ్యారేజ్‌ వద్ద 10 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇక, భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన వర్షాలతో తాలిపేరు  ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. దీంతో 21 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం దగ్గర గోదావరిలో బ అంతకంతకూ పెరుగుతుంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 25.6 అడుగులకు చేరింది. సాయంత్రం వరకు గోదావరిలో వరద 30 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios