తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు వరంగల్ పోలీసులు. నిందితుడు ప్రవీణ్‌కు విధించిన మరణశిక్షను హైకోర్టు జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు సర్వోన్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనున్నారు.

Also Read:9 నెలల చిన్నారిపై రేప్, హత్య: ప్రవీణ్ ఫోన్లో నీలి చిత్రాలు?

హన్మకొండలో 9 నెలల చిన్నారిపై పాశవికంగా అత్యాచారం, హత్య చేసిన ప్రవీణ్ అనే నిందితుడికి వరంగల్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 రోజుల్లో విచారణ నిర్వహించి ఉరిశిక్షను విధించింది. ఈ తీర్పుపై ప్రవీణ్ అతని బంధువులు హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ కేసులో తన తప్పేం లేదని, శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేయడంతో ఉన్నత న్యాయస్థానం దిగువ కోర్టు ఇచ్చిన శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది.

Also Read:ప్రవీణ్ ఓ సెక్స్ ఉన్మాది.. ఆడవారి చీర కనిపించినా...

తీర్పు వెలువడిన అనంతరం దానిని పరిశీలించిన పోలీసులు... ప్రవీణ్ చేసిన నేరం, తగిన ఆధారాలు ఉరిశిక్ష అమలు చేసే స్థాయిలో ఉన్నాయి కాబట్టి హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రేపో, ఎల్లుండో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.