Asianet News TeluguAsianet News Telugu

వేములవాడ ఆలయంలో కిడ్నాపైన బాలుడు సురక్షితం: కిడ్నాపర్ వరంగల్ లో అరెస్ట్


రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు వరంగల్ లో సోమవారం నాడు అరెస్ట్ చేశారు.  కిడ్నాపర్ నుండి పోలీసులు  బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Warangal Police Rescued boy From kidnapper
Author
Warangal, First Published May 16, 2022, 3:00 PM IST

వరంగల్: Rajanna sircilla జిల్లాలోని వేములవాడ ఆలయంలో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ ను పోలీసులు ఉమ్మడి Warangal జిల్లాలో సోమవారం నాడు అరెస్ట్ చేశారు. Kidnapper నుండి పోలీసులు బాలుడిని రక్షించారు. 

వేములవాడ రాజన్న ఆలయం వద్ద నుండి 28 రోజుల వయస్సున్న బాలుడిని కిడ్నాపర్ ఎత్తుకెళ్లాడు.కరీంనగర్ జిల్లాకు చెందిన లావణ్య అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో Vemulawada  ఆలయం మెట్ల వద్ద ఉంటుంది. భర్తతో గొడవ పెట్టుకొని ఆమె వేములవాడ ఆలయం వద్ద ఉంటుంది.

also read:నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్.. రూ.2కోట్లు డిమాండ్.. చివరకు.

ఇద్దరు పిల్లల్లో ఒకరికి రెండేళ్లు. మరొకరికి 28 రోజులు మాత్రమే. ఆదివారం నాడు రాత్రి  ఆలయం మెట్ల వద్ద పడుకున్న Lavanya నుండి బాలుడిని కిడ్నాపర్  తీసుకెళ్లాడు.  లావణ్యకు మద్యం తాగించి  కిడ్నాపర్  బాలుడిని ఎత్తుకెళ్లారు.

ఈ విషయమై సోమవారం నాడు ఉదయం లావణ్య పోలీసులకు పిర్యాదు చేసింది. ఆలయంలో ఉన్న సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఓ మహిళ ఈ బాలుడిని కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసిన మహిళను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేములవాడ ఆలయం నుండి కిడ్నాప్ చేసిన 28 రోజుల బాలుడిని  వరంగల్ పోలీసులు రాజన్న సిరిసిల్ల పోలీసులకు అప్పగించారు.

గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన  కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారిని పోలీసులు రక్షించారు.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సీలో కిడ్నాపర్‌ను  పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. బాలికను నిజామాబాద్ కు తీసుకు వచ్చారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్ మూడేళ్ల కూతురు ఆన్‌కియా హనీతో పాటు తన తల్లిని తీసుకొని నిజామాబాద్ కు బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. బట్టలు తీసుకొని బిల్లు చెల్లించే సమయంలో మూడేళ్ల ఆన్‌కియా హనీ అదృశ్యమైంది. షాపింగ్ మాల్‌తో పాటు సమీపంలోని అన్ని  ప్రాంతాల్లో వెతికారు. పాప ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షాపింగ్ మాల్ సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు బుర్ఖా ధరించిన మహిళ చిన్నారిని తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేశారు.  కిడ్నాప్ జరిగిన మూడు రోజుల తర్వాత మహారాష్ట్ర నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios