మక్సూద్ మరదలితో అఫైర్, చంపేసి దాచేందుకే....: గొర్రెకుంట ఘటనపై సీపీ

 తనతో సహజీవనం చేసిన రఫికాను హత్య చేసిన విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు మక్సూద్ కుటుంబంలోని ఆరుగురితో పాటు మరో ముగ్గురిని కూడ సంజయ్ కుమార్ యాదవ్ హత్య చేసినట్టుగా వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు.

warangal police arrested sanjay yadav in connection of 9 migrants deaths

వరంగల్: తనతో సహజీవనం చేసిన రఫికాను హత్య చేసిన విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు మక్సూద్ కుటుంబంలోని ఆరుగురితో పాటు మరో ముగ్గురిని కూడ సంజయ్ కుమార్ యాదవ్ హత్య చేసినట్టుగా వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు.

సోమవారం నాడు వరంగల్ సీపీ డాక్టర్  రవీందర్ ఈ హత్యల గురించి మీడియాతో మాట్లాడారు.ఈ ఘటనకు సంబంధించి 72 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. నిందితుడిని కూడ సీపీ మీడియా ముందు ఉంచారు.

also read:గొర్రెకుంట కేసులో మరో సంచలనం: మార్చి 8న నిడదవోలు వద్ద ఛోటీ హత్య

గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో  ఈ నెల 21వ తేదీన నాలుగు మృతదేహలు బయటపడ్డాయి.  మక్సూద్, ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన మనమడి మృతదేహాలను వెలికితీసినట్టుగా ఆయన చెప్పారు.

ఈ నెల 22వ తేదీన ఇదే బావిలో ఐదు డెడ్ బాడీలను వెలికితీసినట్టుగా ఆయన చెప్పారు. ఈ మృతదేహాలపై ఆరు పోలీస్ టీమ్‌లు పనిచేసి 72 గంటల్లోనే చేధించినట్టుగా ఆయన చెప్పారు.

మక్సూద్ తో ఆయన భార్య గోనేసంచిలు తయారు చేసే ఫ్యాక్టరీలు తయారు చేసేవారు. వీరు శాంతినగర్ లో నివాసం ఉండే సమయంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ తో పరిచయం ఏర్పడింది.

మక్సూద్ అక్క కూతురు  రఫికా ఐదేళ్ల క్రితం వరంగల్ కు వచ్చింది.  రఫికా అప్పటికే భర్తతో విడిపోయింది. ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పటికే ఒంటరిగా ఉన్న బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ కు రఫికా భోజనం వండి పెట్టేది. దీంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని సీపీ చెప్పారు. 

కొంతకాలం తర్వాత రఫికా సంజయ్ సజీవ దహనం చేశారు. ఈ మేరకు వేరే ఇళ్లు తీసుకొని జీవనం సాగించారు. ఇదే క్రమంలో రఫికా కూతురు కూడ యుక్త వయస్సుకు వచ్చింది. రఫికా కూతురిపై కూడ సంజయ్ కన్నేశాడు. ఈ విషయమై రఫికా సంజయ్ ను నిలదీసింది. తనను పెళ్లి చేసుకోవాలని రఫికా సంజయ్ ను కోరింది. రఫికా పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకొంటానని సంజయ్ చెప్పాడు.

ఈ ఏడాది మార్చి 7వ తేదీన గరీబ్ రథ్ రైలులో రఫికాతో సంజయ్ వరంగల్ నుండి బెంగాల్ కు బయలు దేరాడు. అయితే అప్పటికే అతను నిద్రమాత్రలు తనతో పాటు తీసుకొచ్చాడన్నారు పోలీసులు.

మజ్జిగ ప్యాకెట్లో నిద్రమాత్రలు కలిపి రఫికాకు ఇచ్చాడు. ఆమె మత్తులోకి దిగిన తర్వాత చున్నీతో ఆమెను హత్యచేశాడు.  ఆ తర్వాత రైలు నుండి నిడదవోలు  వద్ద రఫికాను రైలు నుండి తోసేశాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కూడ కేసు నమోదు చేశారని సీపీ తెలిపారు. 

నిద్రలోకి రఫికా జారుకొన్న తర్వాత చున్నీతో ఆమెను గొంతు పిసికి చంపేశాడు. నిడదవోలు వద్ద రైలు నుండి ఆమెను కిందకు తోసేశాడని పోలీసులు చెప్పారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కూడ కేసు నమోదు చేసిన విషయాన్ని సీపీ డాక్టర్ రవీందర్ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

రఫికా గురించి సంజయ్ ను మక్సూద్ కుటుంబం సభ్యులు పదే పదే ప్రశ్నించారు. కానీ అతడి నుండి సరైన సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు కూడ ఫిర్యాదు చేయాలని మక్సూద్ కుటుంబం నిర్ణయం తీసుకొంది. దీంతో వీరిని హత్య చేయాలని సంజయ్ నిర్ణయం తీసుకొన్నాడని పోలీసులు చెప్పారు.

ఈ నెల 16వ తేదీ నుండి 20వ  తేదీ వరకు మక్సూద్ నివాసం ఉండే పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా సీపీ చెప్పారు. ఈ నెల 20వ తేదీన  మక్సూద్ పెద్ద కొడుకు బర్త్ డే అని తెలుసుకొని అదే రోజున వీరిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ నెల 18వ తేదీన హన్మకొండలోని మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడని సీపీ తెలిపారు.

ఈ నెల 20వ తేదీ సాయంత్రం మక్సూద్ కుటుంబం వండుకొన్న భోజనంలో నిద్ర మాత్రల పౌడర్ ను కలిపారు. మరో వైపు తాను చేసే హత్యలకు సంబంధించి సాక్ష్యాలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో బీహార్ కు చెందిన శ్రీరాం, శ్యామ్ లకు చెందిన భోజనంలో కూడ నిద్రమాత్రల పౌడర్ ను కలిపినట్టుగా పోలీసులు తెలిపారు.

అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు అందరూ నిద్ర మత్తులో ఉన్నట్టుగా గుర్తించిన తర్వాత ఒక్కొక్కరిని గోనెసంచుల్లో మూట కట్టి బావిలో వేశారని సీపీ రవీందర్ తెలిపారు. రఫికాను చంపిన విషయం బయటకు రాకుండా ఉండేందుకు గాను మక్సూద్ కుటుంబంతో బీహార్ కు చెందిన ఇద్దరు యువకుల కూడ చంపేశాడని ఆయన చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios