కేటిఆర్ ను కలిసిన వరంగల్ మేయర్ నన్నపనేని

warangal mayor meets ktr
Highlights

సమస్యల చిట్టా 

హైదరాబాద్ లోని ఎచ్ఎండిఎ కార్యాలయంలో ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ను కలిశారు వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్ నగరంలో ఆర్ పి లు (రిసోర్స్ పర్సన్లు గా) సేవలందిస్తున్న వారి సమస్యలను మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటివల నగరంలో ని ఆర్పీ లందరితో వారి సమస్యలపై గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం  వినయ్ భాస్కర్ సమావేశం ఏర్పాటు చేసారు. వారు వారి సమస్యలను, డిమాండ్లను  ఎమ్మెల్యే గారి  దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వారు తమ జీతాలను 10వేలు చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సోమవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి ఆర్పీల సమస్యలను  ఆయనకు వివరించారు.ఈ విషయాలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

loader