వరంగల్ లో లాఠీఛార్జ్.. కాంగ్రెస్ ముట్టడి ఉద్రిక్తత

warangal congress dharna tension
Highlights

పలువురికి గాయాలు

స్మార్ట్ సిటి  పేరు తో అధిక రుసుము వసూలు చేస్తున్నారని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఆఫీసు ముట్టడి జరిగింది. ఈ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.  స్మార్ట్ సిటీ పేరుతో ఎటా 100 కోట్లు కేటాయింపు చేస్తున్నావాటీ ఖర్చు చూపించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. నల్లా కనెక్షన్ కి హైదరాబాద్ లో కంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శిస్తున్నది.

 వరంగల్ నగరపాలక సంస్థలో విలీనం అయిన 42 గ్రామాల ప్రజల ఆవేదన వినిపించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రామాలలో ఉన్నా.. నగరంలోని రుసుములు చెల్లించాలని ఆదేశించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీఛార్జి జరపడంతో నగరంలో ఉద్రికత్త నెలకొంది.

loader