Labourer killed in wall collapse in Langer Houz: ప్రహరీ గోడ కూలి ఒక‌ కార్మికుడు మృతి చెందాడు. ఆరుగురు కార్మికులు ప్రార్థనా మందిరానికి సమీపంలో చెత్తను తొలగిస్తుండగా పక్కనే నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ వారిపై కూలిపోయింది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది.  

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్ లోని లాంగర్ హౌజ్ లో శుక్రవారం ఓ నిర్మాణ స్థలంలో ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు (50) మృతి చెందగా, ఓ వ్యాపారి సహా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జీహెచ్ ఎంసీ సిబ్బంది హాషం నగర్ ప్రాంతంలో చెత్తను తొలగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఆరుగురు కార్మికులు ప్రార్థనా మందిరానికి సమీపంలో చెత్తను తొలగిస్తుండగా పక్కనే నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ వారిపై కూలిపోయింది. పునాది పనుల సందర్భంగా తవ్విన మట్టి కుప్పను గోడకు అతికించారని, అధిక బరువు కారణంగా అది కూలిపోయిందని పోలీసులు వివరించారు.