Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం జిల్లాలో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నాడని మండల ఎమ్మార్వో మెమో జారీ చేయడంతో మనస్థాపానికి గురై ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

vro suicide attempt in badradri district

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నాడని మండల ఎమ్మార్వో మెమో జారీ చేయడంతో మనస్థాపానికి గురై ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

భద్రాచలం మండలంలోని నారాయణరావుపేట లో రేసు ఆదినారాయణ రెడ్డి వీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తలేడన్న కారణంతో మండల తహసీల్దార్ నాలుగు రోజుల క్రితం మెమో జారీ చేశాడు. అంతే కాకుండా అతడి నెలసరి జీతాన్ని కూడా నిలిపివేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వీఆర్వో ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

మండల తహశీల్దార్ హరిచంద్ తో పాటు డిప్యూటి తహసీల్దార్, ఆర్ఐ వేధింపుల కారణంగానే ఆదినారాయణ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, వీఆర్వో సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios