Asianet News TeluguAsianet News Telugu

69 రోజులుగా ఆందోళన.. పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం, గొంతు కోసుకున్న వీఆర్ఏ

వరంగల్ జిల్లా నెక్కొండలో వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయంలో 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు వీఆర్ఏలు. అయితే దీక్షా స్థలంలోనే బ్లేడుతో గొంతు కోసుకున్నాడు మహ్మద్ ఖాసీం అనే వీఆర్ఏ.

vra attempted suicide by cutting his throat in warangal district
Author
First Published Oct 1, 2022, 3:43 PM IST

వరంగల్ జిల్లా నెక్కొండలో వీఆర్ఏ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే వున్న ఉద్యోగులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయంలో 69 రోజులుగా దీక్ష చేస్తున్నారు వీఆర్ఏలు. అయితే దీక్షా స్థలంలోనే బ్లేడుతో గొంతు కోసుకున్నాడు మహ్మద్ ఖాసీం అనే వీఆర్ఏ. అనంతరం అతనిని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. తెలంగాణలో గత కొద్దిరోజులుగా వీఆర్ఏ‌లు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. పే స్కేల్ అమలు, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర డిమాండ్లతో వీఆర్ఏలు సమ్మెకు దిగారు. అయితే ఇటీవల వీఆర్ఏ‌లతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. వారి డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వీఆర్ఏలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios