Asianet News TeluguAsianet News Telugu

బీజేపీకి షాక్: కమలానికి వివేక్ వెంకటస్వామి గుడ్ బై, రాహుల్ తో భేటీ

బీజేపీకి షాకిచ్చారు వివేక్ వెంకటస్వామి.  ఇవాళ బీజేపీకి వివేక్ వెంకటస్వామి  రాజీనామా చేశారు. 
 

Vivek Venkataswamy resigns to BJP lns
Author
First Published Nov 1, 2023, 11:38 AM IST

హైదరాబాద్: మాజీ ఎంపీ   వివేక్ వెంకటస్వామి  బీజేపీకి  బుధవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు.  ఇవాళ  శంషాబాద్ లోని నోవాటెల్  హోటల్ లో  రాహుల్ గాంధీతో  వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు.

Vivek Venkataswamy resigns to BJP lns

 బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖను  వివేక్ వెంటకస్వామి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపారు.బీజేపీ మేనిఫెస్టో కమిటీకి  వివేక్ వెంకటస్వామి చైర్మెన్ గా కొనసాగుతున్నారు.  బీజేపీలోని పరిణామాలపై వివేక్ వెంకటస్వామి  కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.  బీజేపీలోని కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటే  వివేక్ వెంకటస్వామి కూడ  కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే  ఈ ప్రచారాన్ని గత నెల  24న వివేక్ వెంకటస్వామి  ఖండించారు.  తాను  పెద్దపల్లి  పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేస్తానని ప్రకటించారు. తాను కాంగ్రెస్ లో చేరుతానని  చాలా కాలంగా ప్రచారం సాగుతున్న విషయాన్ని  వివేక్ వెంకటస్వామి గుర్తు చేశారు.

also read:వివేక్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఆఫర్.. రేవంత్ చర్చలు.. చెన్నూరు టికెట్ వంశీకి ఇచ్చేందుకు ఒకే..?

2009లో  కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వివేక్ వెంకటస్వామి గెలుపొందారు.ఆ తర్వాత పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.కొంతకాలం పాటు ఆయన బీఆర్ఎస్ లో కొనసాగారు.  బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ లోని కొందరు  నేతలు బీజేపీలో చేరారు.  తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించే సత్తా బీజేపీకి ఉందని  ఆ నేతలు అప్పట్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు  కాషాయ పార్టీలో చేరారు. 

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్ ని తప్పించాలని కొందరు పార్టీ నేతలు  పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.  కొందరు బండి సంజయ్ కు అనుకూలంగా వ్యవహరించారు.ఈ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి పార్టీ జాతీయ నాయకత్వం తప్పించింది.ఈ పరిణామంతో  కొందరు నేతలు  అసంతృప్తితో ఉన్నారు.  బండి సంజయ్ ను పార్టీ బాధ్యతల నుండి తప్పించడంతో  పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు  నెలకొన్నాయనే అభిప్రాయంతో ఉన్న నేతలు కూడ లేకపోలేదు.   ఈ పరిణామాలతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీకి రాజీనామా సమర్పించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత  వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పారు.  

రాహుల్ తో వివేక్ వెంకటస్వామి భేటీ

ఇవాళ ఉదయం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో వివేక్ వెంకటస్వామి  రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తనయుడితో కలిసి వివేక్ వెంకటస్వామి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.  గత శనివారం నాడు  వివేక్ వెంకటస్వామితో  రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతానని వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios