Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్ రోడ్డుపై స్థానికుల ఆందోళన, ట్రాఫిక్ జాం.. వాహనాలు వదిలేసి ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణీకుల పరుగులు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో శంషాబాద్ - గగన్‌పహాడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫ్లైట్ టైం అవుతూ వుండటంతో వాహనాలను రోడ్లపై వదిలి ఎయిర్‌పోర్టుకు పరుగులు పెడుతున్నారు ప్రయాణీకులు. 

villagers protest at shamshabad airport highway ksp
Author
First Published Sep 23, 2023, 5:00 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వుండటంతో స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఎయిర్‌పోర్ట్ రోడ్డును బ్లాక్ చేసి ఆందోళనకు దిగారు. దీంతో శంషాబాద్ - గగన్‌పహాడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఫ్లైట్ టైం అవుతూ వుండటంతో వాహనాలను రోడ్లపై వదిలి ఎయిర్‌పోర్టుకు పరుగులు పెడుతున్నారు ప్రయాణీకులు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన స్థానికులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios