ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యావ్.. మాకేం చేశావ్ : రెడ్యానాయక్‌ను నిలదీసిన గ్రామస్తులు.. వూళ్లోకి నో ఎంట్రీ
డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు నిరసన సెగ తగిలింది. మా గ్రామానికి రావొద్దంటూ గ్రామస్తులు నిలదీశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు చేసిందేమి లేదని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
డోర్నకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు నిరసన సెగ తగిలింది. మా గ్రామానికి రావొద్దంటూ గ్రామస్తులు నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా దంతానపల్లి మండలం రామవరంలో ఈ ఘటన జరిగింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ అనుచరులు బాగుపడ్డారు తప్పించి.. సామాన్యులకు చేసిందేమి లేదని గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
Also Read: బీఆర్ఎస్‌కు ఓటేస్తేనే మీకు ప్రభుత్వ పథకాలు..లేదంటే : రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే.. ఇవాళ ఉదయం కూడా రెడ్యానాయక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మీకు సిగ్గూ, శరం వుంటే నాకే ఓటేయ్యాలంటూ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రెడ్యానాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికుడినైన తనను వదిలేసి సూర్యాపేట నుంచి వచ్చిన వాడికి ఓట్లేలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.