అమాయక ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్న దొంగ బాబాలకు దేహశుద్ధి జరిగింది. నిజామాబాద్ జిల్లా గోద్మేగం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామానికి వచ్చిన నలుగురు వ్యక్తులు.. భూత వైద్యంతో పాటు మద్యానికి బానిసైన వారి చేత తాగుడు మాన్పిస్తామంటూ మాయమాటలు చెప్పారు. అలా ఎస్సీ కాలనీలో ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేలు వసూలు చేశారు.

ఇలా ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద చుట్టుప్రక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు నిలదీయగా అసలు మోసం బయటపడింది. పొంతన లేని మాటలు చెబుతూ దొరికిపోయిన దొంగ బాబాలను పాఠశాల ఆవరణలో నిర్బంధించి గ్రామం నుంచి తరిమికొట్టారు.