హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సెటైర్లు వేశారు. కేసీఆర్ పెట్టింది ఫెడరల్ ఫ్రంట్ కాదని ఫెడో ఫ్రంట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రచార కమిటీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చెయ్యలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ ని గెలిపించింది హోమాలు చెయ్యడానికా అంటూ ప్రశ్నించారు. 

ఫామ్ హౌజ్ లో ఉండేవారికి కాకుండా ప్రజల మనిషికి పట్టంకట్టాలని కోరారు. తెలంగాణ ప్రజలు కోపంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ముందు ఉంచి కేసీఆర్ ఎన్నికల్లో లబ్ధి పొందారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగించాలని డిమాండ్ చేశారు. 

తాను పోటీ చేసే విషయం అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మాత్రం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు విజయశాంతి.  

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ ప్రధాని తొత్తు, టీఆర్ఎస్ కి ఓటేయ్యెుద్దు : విజయశాంతి

మోడీపై మమత పోరు.. నోరుమెదపని కేసీఆర్: రాములమ్మ ఫైర్