Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కండువా దుమ్ము దులిపిన రాములమ్మ

  • రాహుల్ తో కీలక భేటీ
  • పార్టీలో యక్టీవ్ అయ్యేందుకు చర్చలు
  • తెలంగాణలో గ్లామర్ పెంచుకోనున్న కాంగ్రెస్
Vijayashanthi calls on rahul gandhi

సినీ నటి మాజీ టిఆర్ఎస్ ఎంపి విజయశాంతి కాంగ్రెస్ కండువా దుమ్ము దులిపేందుకు రెడీ అయింది. తాాజాగా ఆమె ఢిల్లీలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. ఈసందర్భంగా తాను కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోశించేందుకు ముందుకొచ్చారని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టిఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయశాంతి ఎన్నికల ముందే టిఆర్ఎస్ ను వీడారు.  ఆమెను టిఆర్ఎస్ నుంచి పంపించివేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. అయితే అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వెనువెంటనే రాష్ట్ర విభజన జరగడంతో విజయశాంతి తెరవెనకకు వెళ్లిపోయారు. అయితే గత మూడేళ్లుగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తమిళనాడులో సిఎం జయలలిత మరణం తర్వత తమిళ రాజకీయాల్లోకి విజయశాంతి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆమె కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్లు చర్చ జరిగింది. కానీ ఆమె అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.

తాజాగా రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ఆమె రాహుల్ ను కలిసిన సందర్భంలో ఎఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి రామచంద్ర కుంతియా, తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆమె ఇక కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్నారని, ఇప్పుడు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. 

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో గతంలో ఆమె కీలకంగా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఆమెకు పార్టీలో పొగ పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసిఆర్ తర్వాత ఆమె పాత్ర ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఊపు కనపిస్తుండడంతో ఆమె మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఆర్ఎస్ మీద కసిగా పనిచేస్తారని అంటున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.మొత్తానికి రాములమ్మ రీ ఎంట్రీ తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త పుంతలు తొక్కుతోంది.

 

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి వార్తతోపాటు

మరిన్ని తాజా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

https://goo.gl/4h1Qxh

Follow Us:
Download App:
  • android
  • ios