Asianet News TeluguAsianet News Telugu

టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా విజయశాంతి...

మహేశ్వరం టికెట్ ఆశించిన  పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్.

Vijayashanthi as Chief Coordinator of T- Congress Campaign Committee - bsb
Author
First Published Nov 18, 2023, 8:36 AM IST

హైదరాబాద్ : విజయశాంతి బీజేపీనుంచి కాంగ్రెస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్లు కూడా ముగియడంతో విజయశాంతికి టీ కాంగ్రెస్ లో సముచిత స్థానాన్ని కేటాయించారు. తెలంగాణ ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఇందులో 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ లోకి విజయశాంతిని తీసుకున్నారు. విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా పదవి ఇచారు. 

మహేశ్వరం టికెట్కు ఆశించిన  పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. అభ్యర్థుల పేర్లనూ ప్రకటించారు. 15 మందికి కన్వీనర్లు ఎవరంటే..  కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్ అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్, తదితరులు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios