సమ్మక్క జాతరకు వెంకయ్య నాయుడు

సమ్మక్క జాతరకు వెంకయ్య నాయుడు

వరంగల్ జిల్లాలో జరిగే దేశంలోనే ప్రతిష్టాత్మక జాత అయిన సమ్మక్క జాతరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు అవుతారట. ఈ విషయాన్ని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్ర అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో వెంకయ్య నాయుడును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎంపి నగేష్, సముద్రాల వేణుగోపాలచారి తదితరులు కలిశారు.

ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానించారు. దాంతోపాటు సమ్మక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తించే విషయాన్ని వెంకయ్య నాయుడుతో చర్చించారు. అనంతరం అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ  తర్వాత సమ్మక్క సారలమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశాము. ఈ ఏడాది జరుగుతున్న జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించాము. నిన్న సాయంత్రం కేంద్ర గిరిజనశాఖ మంత్రిని సమ్మక్క సార్లమ్మ జాతరను జాతీయపండుగగా ప్రకటించాలని కోరాము.ఈసారి జాతరకు కోటి మంది భక్తులు వివిధ రాష్ట్రాలనుండి వస్తారని అంచనా వేస్తున్నాం.

జనవరి 30 నుండి నాలుగు రోజులు జరిగే జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈరోజు ఉదయం ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుని కలిసాం. సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఉపరాష్టపతిని కోరాము. తప్పకుండా జాతరకు హాజరవుతానని ఉపరాష్టపతి హామీ ఇచ్చారు. జాతరకు హాజరయ్యే మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము.

దేశ వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రచారం కల్పిస్తున్నాము. ప్రత్యేక హెలిప్యాడ్ లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేశాము.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page