Asianet News TeluguAsianet News Telugu

గాంధీ బొమ్మ కోసం హన్మన్న మౌనం

స్వచ్ఛ భారత్ లో గాంధీ బొమ్మను తీసేసి కళ్లద్దాలు మాత్రమే ఉంచారు. ఇపుడ ఖాదీ కమిషన్ వారు అవి కూడా తీసేసి మోదీని కూర్చో బెట్టారు.

Vh undertakes silent protest against removal of Gandhi from Khadi calender

రాజకీయాలలో దీక్షలేమంత పెద్ద విషయం కాదు.  

 

సాధారన నిరసన దీక్ష మొదలుకుని అమరణ  నిరాహారదీక్ష వరకు అన్నింటికి ఉన్న శక్తి ఎక్స్ పైర్ అయిపోయింది.

 

అదికూడా లోకల్ పోలీసులకు నాయకులకు అవగాహణ ప్రకారమేదీక్షలకు దిగుతున్నారని పిస్తుంది. ఎందుకంటే, దీక్ష ప్రారంభోత్సవం రోజు పెద్దగా జనాల్ని అనుకున్నప్రకారం మొహరిస్తారు. ఫ్రంటు పేజీ వార్త వస్తుంది. రెండో రోజు కూడా ఫ్రంటు పేజీలో రావచ్చు. మూడో రోజు పత్రిక మనవాళ్లదయితే తప్ప ఫ్రంటు పేజీలో రాదు. వార్త లోపల పేజీలొకెళ్లినప్పటినుంచి , ఆమరణ దీక్ష లో కూర్చున్నవాడు పోలీసులకోసం ఎదురుచూడటం ప్రారంభిస్తాడు. ఎపుడొస్తారా, ఎపుడు ‘బలవంతం’గా వ్యాన్లోకి ఎక్కిస్తారా, ఎపుడు అసుపత్రికి తరలించి ఫ్లూయడ్స్ ఎక్కిస్తారాఅని. అగ్రిమెంటు ప్రకారమే మూడో రోజో  నాలుగో రోజో రాత్రి పోలీసులొచ్చి పట్టుకెళ్తారు. కథా సుఖాంతమవుతుంది. కథ మళ్లీ ఫ్రంటుపేజీకొస్తుంది. నేతాజిఇంటికి, పోలీసులు డ్యూటికి  వెళ్లిపోతారు.అందుకే అవేమంత పెద్దగా  ఆసక్తి కల్గించవు. అయితే,  ఇంకొక దీక్ష ఉంది. అది మౌన దీక్ష.

 

జనరల్గా రాజకీయనాయకుల ఈ దీక్ష చేయరు.  ఎందుకంటే, తిండిమానేసి బతగ్గలరు. నీళ్లు తాక్కుండా బతగ్గలరు. నోరు మూసుకుని బతకడం ఈ టెలివిజన్ యుగంలోచాలా కష్టం. ఎంత మంది మార్బలం ఉన్నా, డబ్బు దస్కం ఉన్నా,  రాజకీయాల్లో వీటికంటే ముఖ్యంగా ఉండాల్సిందినోరు. నోరున్నోళ్లే పార్లమెంటులో నైనా,ప్యానెల్ డిబేట్లో నయినా రాణించగలరు. .అందుకే మౌన దీక్ష సాధారణంగా చేయరు. తనకు నోరు లేదుకాబట్టే, 1947 తర్వాత  వచ్చే రాజకీయాల్లోకి రాకూడదని గాంధీ నిర్ణయించకున్నారేమో.కోపమొచ్చినపుడల్లా ఆయన మౌన దీక్ష చేసేందిందుకేనేమో...

Vh undertakes silent protest against removal of Gandhi from Khadi calender

ఈ  నోరున్న వారి కోవలో మనిషే మాజీ రాజ్యసభ సభ్యడు వి.హనుమంతరావు. హైదరాబాద్ లో ఉండే ఈ  సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మోదీ ప్రభుత్వం మీద కోపమొచ్చింది. లెక్క ప్రకారం ఆయన గట్టిగా అరచి గోల చేయాలి. అయితే, అలాకాకుండా,  చిందులేయకుండా నోరుమూసుకుని నిరసన తెపుపుతాననంటున్నాడు.

 

 

ఈ రోజు ఆయన కేంద్ర ఖాదీ కమిషన్ వారు  కాలెండర్ నుంచి గాంధీ బొమ్మ తీసేసి, నూలు వడికే రాట్నం దగ్గిర మోదీని కూర్చోబెట్టి అచ్చేశారు.  ఖాదీ అనేది గాంధీ పోరాట అస్త్రం. అందువల్ల ఈ ఖాదీ బోర్డుకు సంబంధించిన క్యాలెండర్ నుంచి గాంధీ బొమ్మ తీసేయడాన్ని అమోదించేది లేదని హన్మంతరావు చెప్పారు.   క్యాలెంటర్ మహాత్ముడికి రాట్నంతో సహా పునర్మద్రించాల్సిందేనని, లేకపోతే, తన పోరాటం ఉధృతం చేస్తానని రావు హెచ్చరిస్తున్నారు. గాంధీ బొమ్మని మెల్లిమెల్లిగా మాయం చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు అర్థమవుతుంది.

 

మొన్నామధ్య గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ కోపగించుకుంటూనే కొంత సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే, మోదీ ప్రభుత్వం గాంధీని పూర్తి గా తీసేయకుండా కళ్లద్దాల స్థాయికి దించేసింది.స్వచ్ఛభారత్ పోస్టర్లలో కేవలం గాంధీగారి కళ్లద్ధాలుంటాయి.

 

ఇపుడు ఖాదీ కమిషన్ వారు కళ్లద్దాలు లేకుండా చేసి అక్కడ మోదీని కూర్చో బెట్టారు.

 

మొత్తానికే గాంధీని లేపేసినందుకు వి.హనుమంతరావు మౌన దీక్షకు పూనుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో గాంధీ విగ్రహం ఎదుటే ఒక రోజు దీక్షను పూనుకున్నారు. దాదాపు నలభై యేళ్ల నాలుకతో రాజకీయాలు నడిపిన విహెచ్ ఒక రోజుంతా  మౌనంగ ఉండటం ఎంత కష్టమో...
 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios