Asianet News TeluguAsianet News Telugu

పార్టీలు పెట్టించడంలో అమిత్ షా దిట్ట: షర్మిల పొలిటికల్ ఎంట్రీపై విహెచ్

వైఎస్ కూతురు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే విషయంపై కాంగ్రెస్ నేత విహెచ్ స్పందించారు. అన్న మీది కోపంతో షర్మిల పార్టీ పెడుతున్నారని ఆయన అన్నారు.

VH reacts on YS Sharmila political entry, blames Amit Shah
Author
Hyderabad, First Published Feb 9, 2021, 4:54 PM IST

హైదరాబాద్: వైఎస్ కూతురు షర్మిల రాజకీయ రంగ ప్రవేశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు స్పందించారు. పార్టీలు పెట్టించడంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిట్ట అని ఆయన అన్నారు. ఎంపీ సీటు ఇవ్వలేదని అన్న జగన్ మీద కోపంతో షర్మిల పార్టీ పెడుతున్నారని ఆమె అన్నారు.

అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెడితే ఏం లాభమని ఆయన అడిగారు. జగన్ మీద కోపం తీర్చుకోవాలంటే ఆంధ్రలో పార్టీ పెట్టాలని ఆయన అన్నారు షర్మిల పార్టీ పెడితే కేసీఆర్ కే లాభమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని విెచ్ అన్నారు. కాంగ్రెసు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారెవరూ షర్మిల పార్టీలోకి పోతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై షర్మిల ఏం సమాధాన చెబుతారని విహెచ్ ప్రశ్నించారు.  

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని ఆయన అన్నారు. 

వైఎస్ మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని షబ్బీర్ అలీ అన్నారు. వైఎస్ కు కుటుంబ సభ్యులు వారసులు కారని, కాంగ్రెసు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే నిజమైన వారసులని ఆయన అన్నారు. తాను వైఎస్ మంత్రివర్గంలో పనిచేసినా వైఎస్ ను సీఎంను చేసింది మాత్రం కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios