తెలంగాణలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తుందో స్పష్టం చెయ్యాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. కొడుకు కేటీఆర్ ను సీఎం చెయ్యడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలంటూ హడావిడి చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తుందో స్పష్టం చెయ్యాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. కొడుకు కేటీఆర్ ను సీఎం చెయ్యడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలంటూ హడావిడి చేస్తున్నారంటూ అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని....టీఆర్ఎస్ ది కుటుంబ పాలన అని ప్రజలకు అర్థమైందన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు ప్రగతి నివేదిక సభకు 25లక్షల మంది ప్రజలు హాజరైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వీహెచ్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినవారెవరు గెలవలేదని గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.