బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి:ఎంపీ పదవికి వెంకటేష్ రాజీనామా
బీఆర్ఎస్‌ను వీడి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుండి లభించిన పదవులకు కూడ ఆయన రాజీనామా సమర్పించారు.
హైదరాబాద్: పెద్దపల్లి ఎంపీ పదవికి వెంకటేష్ నేతాకాని బుధవారంనాడు రాజీనామా చేశారు. ఈ నెల 6వ తేదీన వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి తరపున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో వెంకటేష్ పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారంలో ఉంది.
also read:నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్
మరో వైపు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి వెంకటేష్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపాలని భారత రాష్ట్ర సమితి ప్లాన్ చేస్తుందనే ఊహగానాలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ ను కలిశారు వెంకటేష్.
also read:నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: గ్రూప్-1లో మరో 60 పోస్టుల పెంపు
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు కే.సీ.వేణుగోపాల్. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యత్వానికి వెంకటేష్ నేతకాని రాజీనామా చేశారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆయన పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి బాల్క సుమన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.