Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: గ్రూప్-1లో మరో 60 పోస్టుల పెంపు

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పోటీ పరీక్షల కోసం  నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు . టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన చేసిన తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

Telangana Government increases  60 posts under group-1 lns
Author
First Published Feb 6, 2024, 3:38 PM IST


హైదరాబాద్:  నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-1 లో భాగంగా  మరో 60 పోస్టులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో గ్రూప్ -1 కింద  503 పోస్టులను భర్తీ చేయాలని  నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ 503 పోస్టులకు అదనంగా  60 పోస్టులు పెంచింది ప్రభుత్వం. గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని  తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కోరింది.

రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసింది.2023 అక్టోబర్  16న ప్రిలిమినరీ పరీక్షను కూడ నిర్వహించారు. ఈ పరీక్షను రద్దు చేశారు. మరోసారి కూడా ప్రిలిమినరీ పరీక్షను కూడ నిర్వహించారు. అయితే  ఈ పరీక్ష విధానం సరిగా లేదని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.  అయితే  ఈ విషయమై సుప్రీంకోర్టులో  అప్పీల్ చేయాలా..  లేదా  హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా అనే విషయమై  తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే అదే సమయంలో  తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పాలకవర్గం కూడ మారింది. మాజీ డీజీపీ  మహేందర్ రెడ్డి చైర్మెన్ గా నియమితులయ్యారు. 

యూపీఎస్‌సీ తరహాలో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయమై  అధికారుల కమిటీ కూడ అధ్యయనం చేసింది. యూపీఎస్‌సీ చైర్మెన్ ను కూడ  సీఎం రేవంత్ రెడ్డి కూడ  కలిసిన విషయం తెలిసిందే. అయితే  రాష్ట్ర ప్రభుత్వం  ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న  60 పోస్టులను  గుర్తించింది.దీంతో గ్రూప్-1 కింద  మొత్తం  పోస్టులు  563కి చేరుకున్నాయి.  అయితే  గతంలో నోటిఫికేషన్ తో కలిపి  ఈ పోస్టులను భర్తీ చేస్తారా.. వేర్వేరుగా నోటిఫికేషన్ ఇస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios