కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇళ్లకే పరిమితమైపోయారు. సంఘంలో ఉండేవారి పరిస్ధితే ఇలా ఉంటే ప్రపంచానికి దూరంగా అడవుల్లో వుండే గిరిజనుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.

అసలు కరోనా అంటే ఏంటో కూడా తెలియని ఈ అడవి తల్లి బిడ్డలకు ప్రస్తుత పరిస్ధితుల్లో నిత్యావసరాలు తెచ్చుకోవడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకుంటున్నారు.

తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాకెళ్ల గూడెం, నార్లాపూర్, ములుగు‌కు సమీపంలో ఉన్న 3 వెనుకబడిన తండాల ప్రజలకు వీబీఐటీ కళాశాల విద్యార్ధులు నిత్యావసర వస్తువులు అందజేశారు.

Also Read:

ఇంటింటికీ కూరగాయలు, నూనెప్యాకెట్లు.. : అనిల్ కుమార్ యాదవ్

అడవిలో సీతక్క : అన్నం పెట్టి ఆదరించినవారి ఆకలి తీర్చడానికే..

బస్సులో కిరాణా షాపులు.. వ్యాన్ లో ఏటీఎంలు.. ఖమ్మంలో వినూత్న ప్రయోగం..