పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన వనితారెడ్డి

vanitha reddy surrender to jubli hills police
Highlights

  • జూబ్లిహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయిన వనితారెడ్డి
  • విజయ్ ఆత్మహత్యకు తాను కారణం కాదని ప్రకటన

సినీ నటుడు విజయ్ భార్య వనితారెడ్డి జూబ్లిహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయింది. గత వారం కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ ఆత్మహత్యకు ఎవరు కారణమన్నదానిపై విచారణ జరుగుతున్నది. విజయ్ ఆత్మహత్యకు భార్య వనిత కారణమని విజయ్ తల్లిదండ్రుులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆమె అప్పటినుంచి పరారీలో ఉంది. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కానీ... వనితారెడ్డి మాత్రం ఇన్నిరోజులు పోలీసులకు దొరకుండా తప్పించుకు తిరిగారు. తాజాగా ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయారు.

తన తప్పేంలేదని, విజయ్ ఆత్మహత్యకు తాను కారణం కాదని ఆమె మరోసారి మీడియాకు చెప్పారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయ్ తల్లిదండ్రులు తనపైన నేరం మోపేంందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఆమె జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ ఉందని చెబుతున్నారు. 

loader