Asianet News TeluguAsianet News Telugu

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు: రాఘవ అరెస్ట్, స్వయంగా పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే వనమా

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వయంగా రాఘవను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే వనమా. 

vanama raghavendra rao arrested in palvancha family suicide case
Author
Kothagudem, First Published Jan 6, 2022, 4:03 PM IST

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వయంగా రాఘవను పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే వనమా. హైదరాబాద్‌కు వచ్చి రాఘవను తీసుకెళ్లారు కొత్తగూడెం పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి ఎమ్మెల్యే వనమాతో పోలీసులు టచ్‌లోనే వున్నారు. పోలీసులకు అప్పగించే ముందు మీడియాతో మాట్లాడటానికి రాఘవ పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. 

అంతకుముందు తన కొడుకు రాఘవపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని  ఎమ్మెల్యే Vanama Venkateshwara rao ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రజలకు బహిరంగ లేఖ రాశాడు. ఈ నెల 3 వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన Ramakrishna కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన suicide కు వనమా రాఘవేందర్ రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు ప్రకటించారు. ఈ మేరకు selfie వీడియోను తీశాడు.ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. 

ఈ విషయమై  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. బహిరంగ లేఖ రాశారు. తన కొడుకు  vanama Raghavendra raoను పోలీసులకు అప్పగిస్తానని వనమా వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. పోలీసులకు, న్యాయ వ్యవస్థకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కోరారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా నా కొడుకుని అప్పగిస్తానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు చెప్పారు.రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. 

Also read:వనమా రాఘవ నా భార్యను పంపించాలని అడిగాడు: రామకృష్ణ సెల్ఫీ వీడియో

ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు ముందు తీసిన సెల్పీ వీడియోలో వనమా రాఘవేందర్ తనతో వ్యవహరించిన తీరును రామకృష్ణ వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. పిల్లలు లేకుండా తన భార్యతో హైద్రాబాద్ కు వస్తేనే తన సమస్యను పరిష్కరిస్తానని వనమా రాఘవేందర్ తనను బెదిరించారన్నారు. శ్రీలక్ష్మితో తన వివాహమై 12 ఏళ్లైనా ఎలాంటి పొరపొచ్చాలు లేవన్నారు. డబ్బులైతే ఇస్తాం కానీ, భార్యను ఎలా పంపాలని ఆయన ప్రశ్నించారు.

నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు.రాజకీయ, ఆర్ధిక బలుపు ఉన్న వనమా రాఘవ లాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని  రామకృష్ణ అడిగారు.  వనమా రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. నీ సమస్య తీరాలంటే నీ భార్యను  తీసుకొని హైద్రాబాద్ కు రా.. అప్పటి వరకు  నీ సమస్య పరిష్కారం కాదని రాఘవేందర్ తెగేసి చెప్పాడన్నారు. ఎవరి వద్దకు వెళ్లినా కూడా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరని రాఘవేందర్ తనను బెదిరించినట్టుగా రామకృష్ణ  వివరించారు. ఎదుటి మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి  రాఘవేందర్ తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ చెప్పారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios