పెద్దపల్లి జంట హత్యలపై గురువారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.
హైదరాబాద్:పెద్దపల్లి జంట హత్యలపై గురువారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు.
అడ్వకేట్ శ్రవంత్ శంకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వామన్ రావు దంపతులను హత్య కేసును రాష్ట్ర పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ చేపట్టే అవకాశం ఉంది.
ఈ నెల 17వ తేదీన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు వామన్ రావు దంపతులను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపైనే వామన్ రావు దంపతులను దుండగులు కత్తులతో నరికి చంపారు.ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్రంలో కోర్టుల్లో విదులను న్యాయవాదులు బహిష్కరించారు.
వామన్ రావు దంపతుల హత్య ఘటనను పలువురు ఖండించారు. వామన్ రావు కుటుంబసభ్యులను బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ గురువారంనాడు పరామర్శించారు. న్యాయవాద దంపతులను హత్య చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్య వెనుక ఉన్న వారిని బయటపెట్టాలని ఆయన పోలీసులను కోరారు.
