కాంగ్రెస్‌లోకి వచ్చినా.. కేసీఆర్ ‘శీనన్న’ అంటే చాలు...డీఎస్ మళ్లీ..

v hanumantha rao comments on d srinivas
Highlights

డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తామంటే తాము ఒప్పుకోమని కుండబద్ధలు కొట్టారు.. నాడు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్లారని.. మళ్లీ ఇప్పుడు పార్టీలోకి వస్తానంటున్నారని విమర్శించారు వీహెచ్.

టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లోకి తిరిగిరాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుండటంతో.. టీ.కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ విషయంపై మాట్లాడుతూ.. డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తామంటే తాము ఒప్పుకోమని కుండబద్ధలు కొట్టారు..

నాడు కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్లారని.. మళ్లీ ఇప్పుడు పార్టీలోకి వస్తానంటున్నారని విమర్శించారు.. ఒకవేళ డీఎస్‌ను పార్టీలోకి తీసుకున్నా.. కేసీఆర్ మళ్లీ పిలిచి శీనన్న అంటే చాలు ముఖ్యమంత్రికి డీఎస్ భజన చేస్తారంటూ సెటైర్లు వేశారు.. అందుకే డీ.శ్రీనివాస్‌ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలో వద్దో పార్టీ హైకమాండ్ ఆలోచించాలని కోరారు.. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పైనా వీహెచ్ విమర్శలు చేశారు.. ముఖ్యమంత్రికి బీసీలంటే ప్రేమ లేదు కానీ.. వారి ఓట్లు మాత్రం కావాలని మండిపడ్డారు.

loader