Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి గెలుపేమైనా వరల్డ్ కప్ గెలుపా

  • కేసీఆర్ పై విరుచుకుపడ్డ హన్మంతరావు
  • సింగరేణి గెలుపు ఓ గెలుపే కాదని విమర్శ
  • సీఎం బాష సరిగా లేదు
  •  
v hanmath rao fires on kcr

సింగరేణి ఎన్నికల గెలుపుతో సీఎం కేసీఆర్ వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నాడని, అసలు సింగరేణి గెలుపు పెద్ద గెలుపే కాదని కాదని వీహెచ్ ఎద్దేవా చేశాడు. కూతురిని గెలిపించాలని కేసీఆర్ సింగరేణి ఎన్నికల్లో నేరుగా జోక్యం చేసుకుని సీఎం పదవికి ఉన్న హుందాతనాన్ని పోగొట్టారని  విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షకూటమికి మద్య ఓట్ల తేడా కేవలం నాలుగువేలేనని, కేసీఆర్ అది గమనించి మాట్లాడాలని అన్నారు.
ఉద్యమ సమయంలో కోదండరాం ను వాడుకొని ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతున్న కోదండరాం ను బెదిరిస్తున్నాడని, ఓ ప్రొపెసర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్రించారు. 
కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించే నైతిక హక్కు కేసిఆర్ కు లేదని వీహెచ్ అన్నారు. నరేంద్రమోదీ దృష్టిని ఆకర్షించాలనే ఇందిరా గాంధీ,నెహ్రూ, సోనియా గాంధీ పై విమర్శలు చేస్తున్నాడు. దేశం కోసం పోరాడిన ఉత్తమ్ కుమార్ ను దొర అని విమర్శించడం తగదన్నారు. మీరే దొరలు కాబట్టే నక్సలైట్లు తరిమికొడితే  గ్రామాలు వదిలి పట్నం పారిపోయి వచ్చారని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకమాండ్ అనుమతితో  రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా రథయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మాత్రలో నీవు దొరవా .. కాదా అనేదానిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు.
కేసీఆర్ విలేకర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పత్రికల వాళ్ళు బయపడేవారు కాదని, వాళ్లేమైనా నీ క్యాబినెట్ లో పనిచేసే తాబేదారులా అని ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో ప్రజలు  టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios