ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక

తెలంగాణ శాసనసభా స్పీకర్ మధుసూధనాచారిపై టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.


నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ నాన్చుడుధోరిణితో వ్యవహరించడం వల్లే ఆయన ముందు నిరసన చేపట్టామని తెలిపారు.

స్పీకర్ తీరు ఇప్పటికైనా మారకపోతే ఆయన పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు.