హైదరాబాద్: కాప్రా భూ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చెప్పారు.కాప్రా భూ వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై పోలీసులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం నాడు స్పందించారు. కాప్రాలో ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా తాను కాపాడినట్టుగా ఆయన చెప్పారు. 

also read:భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి: కేసు నమోదు

 ఈ భూమిని తాను  కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే దేనికైనా సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు.  తనపై  తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. కాప్రాలో భూ విషయంంలో  ఎమ్మార్వో గౌతం కుమార్ తో పాటు ఎమ్మెల్యేపై కూడ కేసు నమోదైంది. తన వద్ద డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.