హైదరాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సతీమణి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని హబ్సిగూడ డివిజన్ నుండి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది.

also read:ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటిన బీజేపీ: నాడు టీడీపీ పొత్తుతో 4 స్థానాలే

ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్ధి  కె. చేతన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్ధి చేతిలో ఎమ్మెల్యే సతీమణి స్వప్న ఓటమి పాలయ్యారు. ఉప్పల్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రజిత విజయం సాధించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. కానీ గతంలో కంటే మెరుగైన స్థానాలను బీజేపీ కైవసం చేసుకొనే దిశగా వెళ్తోంది.  అయితే ఎమ్మెల్యే సతీమణి ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఎమ్మెల్యే సతీమణి ఓటమికి గల కారణాలపై పార్టీ  నాయకత్వం ఆరా తీస్తోంది.

స్థానిక అంశాలు కూడ ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలను కొట్టిపారేయలేమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఏఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని టీఆర్ఎస్ నాయకత్వం విశ్లేషిస్తోంది.