కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ రోజు భేటీ అయ్యారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరిన అఖిలేశ్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీని దింపడమే తమ అందరి లక్ష్యం అని ఆయన పేర్కొనడం గమనార్మం. 

పలికారు. అనంతరం, ఆయన ప్రగతి భవన్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

బేగంపేట్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే విపక్షాల లక్ష్యం అని ఆయన అన్నారు. అందుకోసం బీజేపీ ప్రత్యర్థులను ఏకం చేయాల్సిన అవసరం ఉన్నదని, వారిని కలుపుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. విపక్షాలు బీజేపీపై చేయబోతున్న పోరాటం గురించి కేసీఆర్‌తో చర్చించడానికి హైదరాబాద్ వచ్చానని తెలిపారు. తమ అందరి లక్ష్యం బీజేపీని ఓడించడమే అని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో భేటీ తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

పట్నాలో విపక్షాలన్నీ కలిసి సార్వత్రిక ఎన్నికలను ఐక్యంగా పోటీ చేయాలనే ప్రతిపాదనపై చర్చించాయి. మరో భేటీలో చాలా విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అయితే, మహారాష్ట్ర రాజకీయ పరిణామాల కారణంగా బెంగళూరలో నిర్వహించతలపెట్టిన సమావేశం వాయిదా పడింది. 

విపక్షాల ఐక్యతా సమావేశానికి కేసీఆర్‌కు ఆహ్వానం లేకపోవడం గమనార్హం. కేసీఆర్‌ను బీజేపీకి మంచి చేసేవాడిగానే ఆ పార్టీలు భావించాయి. బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్‌లను ఆ సమావేశానికి ఆహ్వానించలేదు. అయితే, బీజేపీ, కాంగ్రెస్సేతర కూటమికి కేసీఆర్ స్వయంగా మమతా బెనర్జీని, అఖిలేశ్ యాదవ్‌లను కలిసి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక వైపు విపక్షాల ఐక్య కూటమి ప్రయత్నాలు జరుగుతుండగానే.. ఆ ప్రయత్నాల్లోనూ క్రియాశీలకంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు కేసీఆర్‌ను కలవడానికి రావడం గమనార్హం. విపక్షాల ఐక్య కూటమిలోకి బీఆర్ఎస్ ఆహ్వానిస్తున్నాడా? విపక్షాల ఐక్యత సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చి కేసీఆర్‌ను కలవడానికి వచ్చాడా? అనే వేచి చూడాలి.

Also Read: భట్టి విక్రమార్కకు ప్రాధాన్యత.. గన్నవరం వరకు రాహుల్‌తో కారులో ప్రయాణం.. ప్రత్యేక మంతనాలు

అయితే, ఈ నెలలోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. ఈ బిల్లును అడ్డుకోవడానికి రాజ్యసభలోనే కొంత అవకాశం ప్రతిపక్షాలకు ఉన్నది. ఈ నేపథ్యంలోనే అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.