పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి: పోలీసుల దర్యాప్తు
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం నాడు రాత్రి రాళ్లతో దాడికి దిగారు. హైద్రాబాద్ అమీర్ పేట ఎల్లారెడ్డి గూడలోని పోసాని కృష్ణ మురళి నివాసంపై ఈ రాళ్ల దాడి జరిగింది.
హైద్రాబాద్ అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని కృష్ణమురళి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ విషయమై పోసాని కృష్ణ మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసాని ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
8 మాసాలుగా వేరే చోట పోసాని కృష్ణ మురళి నివాసం ఉంటున్నారు. పోసాని కృష్ణ మురళి నివాసం పై దాడికి సంబంధించి వాచ్ మెన్ పోసాని కృష్ణ మురళికి సమాచారం ఇచ్చాడు. అంతేకాదు పోలీసులకు కూడ వాచ్ మెన్ ఫిర్యాదు చేశఆడు.రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంతో పాటు వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించారు.ఈ విమర్శలపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. పోసాని కృష్ణ మురళి వరుసగా రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.
also read:పోసాని కృష్ణ మురళిపై జనసేన ఫిర్యాదు: లీగల్ ఓపినియన్ కోరిన పంజాగుట్ట పోలీసులు
రెండు రోజుల క్రితం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశాడు.ఈ సమావేశం ముగించుకొని వెళ్తున్న సమయంలో పోసానిపై జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.
పవన్ కళ్యాణ్ పరువుకు నష్టం కల్గించేలా మాట్లాడారని పోసాని కృష్ణ మురళిపై జనసేన తెలంగాణ ఇంచార్జీ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పంజాగుట్ట పోలీసులు న్యాయ సలహాకు పంపారు.
ఈ నెల 29వ తేదీన గుంటూరు మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని వపన్ కళ్యాణ్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలతో పాటు పోసాని కృష్ణ మురళి లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానమిచ్చారు.పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి జరగడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.