హైదరాబాద్: రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో  టీఆర్ఎస్ నేత చైతన్య రెడ్డి  ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నాడు దాడికి దిగారు.

శనివారం నాడు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లో  టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దుర్గానగర్ లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి కారుపై టీఆర్ఎస్ వర్గీయులు  రాళ్ల దాడికి దిగినట్టుగా బీజేపీ  నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల బాహాబాహీ: మైలార్‌‌దేవ్‌పల్లిలో ఉద్రిక్తత

ఆదివారం నాడు ఉదయం వినాయకనగర్ లోని టీఆర్ఎస్ మహిళా నేత చైతన్య రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. చైతన్య రెడ్డి ఇంట్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ఇంటిని పరిశీలించారు. 

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ డివిజన్ లో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణలుు చోటు చేసుకొంటున్నాయి.