హైదరాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. మైలార్‌దేవ్‌పల్లిలో ఇరు పార్టీల నాయకులు ఘర్షణ జరిగింది. దుర్గానగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు కార్పోరేటర్.

ఈ సమయంలోనే వాగ్వాదం చోటు చేసుకుని, ఘర్షణకు దారి తీసింది. కార్పోరేటర్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది.

దీనిపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గతంలో కూడా టీఆర్ఎస్ కార్యర్తలపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడిన ఉదంతాలు వున్నాయి.