హైదరాబాద్ లో పట్టపగలు దారుణం
హైదరాబాద్ లో మరోసారి కాల్పులు ఘటన పునరావృతం అయింది. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న మన్మధ దాలియా.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లో నివాసముంటున్నారు.
ఆదివారం మధ్యాహ్నం ఆయన తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి అతడిపై కాల్పులు జరిపారు.
అనంతరం బైక్‌పై వెంటనే అక్కడి నుంచి పరారైయ్యారు. తుపాకీ కాల్పులకు గురైన మన్మధ దాలియాను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా సంఘటస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
