హైద్రాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో  ఓ కార్పోరేట్ స్కూల్ కు చెందిన ఆన్ లైన్ క్లాసులో ఆగంగతకుడు ప్రత్యక్షమయ్యాడు.  టీచర్లు, విద్యార్ధులతో అసభ్యంగా ప్రవర్తించాడు.  అంతేకాదు ఈ లింక్ ను యూట్యూబ్ లో పోస్టు చేశాడు  ఈ విషయమై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: హైద్రాబాద్ pet basheerabad లో కార్పోరేట్ స్కూల్ కు చెందిన ఆన్ లైన్ క్లాసులో ఆగంతకుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే విద్యార్ధులతో పాటు టీచర్ల పట్ల ఆగంతకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు ఈ లింక్ ను ఆగంతకుడు యూట్యూబ్ లో పోస్టు చేశాడు.ఈ విషయమై కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆన్ లైన్ క్లాసులోకి ఆగంతకుడు ఎలా ప్రవేశించాడని స్కూల్ యాజమాన్యం కూడా విచారణ చేస్తోంది. మరో వైపు స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు.కార్పోరేట్ స్కూల్ టీచర్ 7వ తరగతి విద్యార్ధులకు పాఠాలను బోధిస్తున్న సమయంలో ఆగంతకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగంతకుడు ఈ online లింక్ ను డౌన్ లోడ్ చేసుకొని క్లాసు జరుగుతున్నసమయంలో ప్రత్యక్షమయ్యాడు. క్లాసు బోధిస్తున్న టీచర్ పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. 

గతంలో హైద్రాబాద్ పరిధిలోని ఇదే తరహలో ఘటన చోటు చేసుకొంది. ఇంటర్ విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులో ప్రవేశించిన ఆగంతకుడు ఓ విద్యార్ధిని పేరును ప్రస్తావిస్తూ ఆమెపై అత్యాచారం చేస్తానని హెచ్చరించాడు. ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్ లోని ప్రవేశించాడు. ఓ విద్యార్థిని పేరును వ్యాఖ్యానిస్తూ.. ఆమెను రేప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతోపాటు ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు సైతం పంపాడు. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం ఆ మరుసటి రోజు పాస్ వర్డ్ ను మార్చేసింది. కళాశాల లెక్చరర్ జీ మెయిల్ ను హ్యాక్ చేసి దాని ద్వారా పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఫలానా టీచర్ వరస్ట్ అంటూ కామెంట్లు పెట్టాడు. ఈ విషయమై కేసు నమోదు చేశారు.

also read:ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. నగ్నంగా వీడియోలు తీసిన బాలిక..!

గతంలో ఆన్ లైన్ క్లాసుల్లో ఆశ్లీల వీడియోల లింకులు పోస్టు కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసకొన్నాయి. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆన్ లైన విద్యావిధానానికి మొగ్గు చూపాయి. అయితే కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భౌతికంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. దీంతో స్కూల్స్, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి.

అయితే ఇటీవల కాలంలో Telangana రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 38 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరికొందరి శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాు రావాల్సి ఉంది. కరోనా కేసులు పెరిగితే మాత్రం రానున్న రోజుల్లో మళ్లీ ఆన్ లైన్ క్లాసులు అనివార్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో corona కేసులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్, క్రిస్ మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.