Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. నగ్నంగా వీడియోలు తీసిన బాలిక..!

ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. 

teenage girl shares her naked videos and photos on social media in Gujarat
Author
Hyderabad, First Published Aug 30, 2021, 1:26 PM IST

కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు.  అయితే.. చదువులు ఆగకుండా ఉండేందుకు.. ఆన్ లైన్ విద్య కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ స్మార్ట్ ఫోన్ లలో క్లాసులు వినకుండా పిల్లలు తప్పుదారి పడుతున్నారు. కొందరు గేమ్స్ లో మునిగి తేలుతుంటే.. కొందరు.. అశ్లీల వీడియోలకు అలవాటుపడుతున్నారు. తాజాగా ఓ బాలిక ఇలానే నగ్నంగా వీడియోలు తీసుకొని.. వాటిని కాస్త వెబ్ సైట్లలో పోస్టు చేసింది. ఈ విషయం తెలిసి పేరెంట్స్ షాకయ్యారు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అహ్మదాబాద్‌కు చెందిన బాలిక (15)కు తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొన్నిరోజుల కిందట స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చారు. అప్పటి నుంచి బాలిక ఆన్‌లైన్‌ క్లాసులు వింటోంది. అయితే ఇటీవల తల్లిదండ్రులకు తమ కుమార్తె నగ్న వీడియో కనిపించింది. ఈ విషయాన్ని బంధువులు వారికి చెప్పారు. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు గుండెపోటుకు గురయ్యారు. బంధువుల సహాయంతో వారు ఆస్పత్రిలో చేరారు. అనంతరం బాలికను వీడియో గురించి ఆరా తీయగా విస్తుగొల్పే విషయాలు తెలిపింది.

ప్రత్యేక గదిలో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్న సమయంలో ఓ వైబ్‌సైట్‌ కనిపించింది. అది తెరచి చూడగా మొత్తం నగ్న వీడియోలు, చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడడం ప్రారంభించిన బాలిక వాటికి కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది అలవాటుగా చేసుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో కొందరితో పరిచయమైంది. వారు బాలికకు నీ వీడియో కూడా పెట్టు అని బలవంతం చేస్తున్నారు. తరచూ అడుగుతుండడంతో ఒకరోజు బాలిక తన నగ్న వీడియో, ఫొటోలను ఆ వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోకు స్పందన బాగా వచ్చింది. దీంతోపాటు తమ బంధువుల పిల్లలకు కూడా ఆ వెబ్‌సైట్‌ను ఫాలో కావాలని.. మీరు కూడా ఫొటోలు, వీడియోలు పంచుకోవాలని చెప్పింది.

ఈ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చీవాట్లు పెట్టి ఈ బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. జరిగిన విషయం చెప్పగా షాక్‌కు గురయిన ఆ తల్లిదండ్రులు ఇద్దరు గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios