సమగ్ర కుటుంబ సర్వే ను టీఆరెస్ ప్రభుత్వం సరైన విధంగా ఉపయోగించలేదని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ జనాభా లెక్కింపు కోసం సెన్సెస్ ని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

పార్లమెంట్, అసెంబ్లీ విభజన కు సెన్సెస్ డేటా ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రతి కుటుంబం డేటా పూర్తి భద్రతగా ఉంటుందని.. ఎన్ పీఆర్ లో కచ్చితంగా డాక్యుమెంట్ ఇవ్వాలని రూల్ లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read:న్యూస్ @ 90 సెకండ్స్

సీఆర్‌సీని పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కొన్ని రాజకీయ పార్టీలు, మేధావులు ఎన్‌ఆర్సీని విమర్శిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. బిల్లు వల్ల ఏ ఒక్క భారతీయుణ్ణి దేశం నుంచి పంపించే అవకాశం ఉండదని, భారతీయులను విదేశాలకు పంపించే హక్కు కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏ ఒక్క మతం హక్కును తొలగించడానికి కేంద్రానికి హక్కు లేదని... ప్రతిపక్షాలు భాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌‌లో అల్పసంఖ్యాక మతాల హక్కులను కలరాస్తున్నారని.. 947 లొనే పాకిస్తాన్ నుంచి హిందూ, సిక్కులు, జైనులు వస్తే భారతదేశ హక్కులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

ఎన్ఆర్సీ అనేది కొత్త బిల్లు కాదని.. 2015లోనే లోక్‌సభలో పాస్ అయ్యిందన్నారు. రాహుల్ గాంధీకి ఎన్‌పీఆర్‌కి -ఎన్ఆర్‌సీకి తేడా తెలీయదని.. సీఏఏ-జీఎస్టీని కలిపి రాహుల్ మాట్లాడుతున్నారని మంత్రి సెటైర్లు వేశారు.

Also Read:కరీంనగర్ జిల్లాకు కరువు పీడ తొలగినట్లే: సీఎం కేసీఆర్

ఎన్‌పీఆర్ అంటే పేదలపై ట్యాక్స్ అంటున్నారని...అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం బాధాకరమని కిషన్ విమర్శించారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఏ రకమైన చట్టం బీజేపీ తీసుకురాదని.. భవిష్యత్‌లోనూ అలాంటి ఉద్దేశం లేదని కిషన్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు.

దొడ్డిదారిన రాహుల్ ఇంటికి వస్తే ఆయన అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్ఆర్‌సీ-సీఏఏ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది చెప్పడానికి ఆయన చర్చకు వస్తారా అని కిషన్ సవాల్ విసిరారు. అసదుద్దీన్ ఒవైసీ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.