కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు జీవన్ రెడ్డి(47) గురువారం రాత్రి తుది శ్వాసవిడిచారు. 

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు జీవన్ రెడ్డి(47) గురువారం రాత్రి తుది శ్వాసవిడిచారు. జీవన్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కిషన్ రెడ్డి అక్క బావా లక్ష్మీ, నర్సింహా రెడ్డి హైదరాబాద్ సైదాబాద్‌లో నివాసముంటారు.వారి కుమారుడే జీవన్‌రెడ్డి. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జీవన్ రెడ్డి ఒక్కసారి కుప్పకూలి పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు సంతోష్ నగర్ డీఆర్‌డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ..చికిత్స పొందుతూ జీవన్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతితో సైదాబాద్‌లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.

ఇక జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్టు కుటుంబీకులు ప్రకటించారు. మరణించిన జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరూ కుమారులు.