టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మరిచి కేంద్రంపై విమర్శలు చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని హెచ్చరించారు. 

ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేంద్రాన్ని విమర్శించడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన కేటీఆర్‌ రాష్ట్రంలోని అన్ని శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

భైంసా ఘటనలు, ఫిర్యాదులపై నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరబోతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ షాడో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని శాఖలను శాసిస్తున్నారని.. ఏ ప్రాతిపదికన ఆయన అధికారం చెలాయిస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదేపదే టీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని మోడీ అమ్మేస్తారని తప్పుడు ప్రచారం చేశారంటూ కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుపై కేంద్రం విధాన నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు.

నష్టాల్లో వున్న విశాఖ ఉక్కు పరిశ్రమను నడపటం భారమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ఏపీ ప్రభుత్వం తీసుకుంటానంటే కేంద్రం ఆలోచిస్తుందని... విశాఖ ఉక్కు కన్నా ముందు కేటీఆర్‌ రాష్ట్ర సమస్యలను పట్టించుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.